Saturday, September 11, 2010
Mori and Clinton
this is a true story from the Japanese Embassy in US..!!!
A few years ago, Prime Minister Mori was given some Basic English conversation training before he visits Washington and meets president Bill Clinton... The instructor told Mori "Prime Minister, when you shake hand with President Clinton, please say 'how are you'. Then Mr. Clinton should say," I'm fine, and you?" Now you should say ' me too'. Afterwards we, translators, will do all the work for you.
"It looks quite simple, but the truth is....When Mori met Clinton, he mistakenly said "Who Are You?" instead of "How are you". Mr. Clinton was a bit shocked but still managed to react with humor: "Well, I'm Hilary's husband, ha-ha...." Then Mori replied "Me too, ha-ha.." Then there was a long silence in the meeting room....
Friday, September 3, 2010
YSR - అభిమానులకై YSR condolence song link - anoop rubens composition
కన్నీళ్ళు అలలై పొంగెను
గుండెల్లొ బాధే నిండెనా ..
నీ నవ్వు చెరిగేనా..
నీ ప్రేమే ముగిసేనా..
నీ మీద మరణం గెలిచెనా..
ఈ చేదు నిజమే నిలిచెనా
మా శోకమాగేనా ...
నీ రాక కలలేనా..
రాజశేఖరా... మము విడిచిపోకయా..
http://rapidshare.com/files/392214802/www.jaganism.com_anoop_rubens_ysr_condolence_song.mp3
తెలుగు భాషా పరిణామక్రమం
భాషావేత్తలంటే ఒకప్పుడు - ఆశు కవులు, కావ్య కర్తలు,అవధానులు
ఆ తర్వాత ... కవులు, గద్య రచయితలుప్రస్తుతం ... గద్య రచయితలు, బ్లాగర్లు ( నేను మినహ..)
కొంత కాలానికి ... తెలుగు లో వ్రాయ గలిగి / చదవగలిగిన వాడు
ఆపై కొంత కాలానికి ... తెలుగు లో మాట్లాడ గలిగిన వాడు
మరికొంత కాలానికి ... తెలుగు ఒక ప్రాచీన భాష.
మరి తెలుగు ని మన తర్వాతి తరాలకు అందజేసేదెలా ??
చింతించకండి !! వేరే భాషలలోంచి తెలుగులోకి తర్జుమా చేసే software ని పరిరక్షించుకుంటే చాలు.
Wednesday, July 21, 2010
ఆల్ ఈజ్ వెల్ ...
మీలో చాలా మంది 3 Idiots సినిమా చూసుండే ఉంటారు. అందులో ఆల్ ఈజ్ వెల్" కాన్సెప్ట్ మీకు నచ్చిందనుకుంటాను. జీవితంలో కష్టాలు,నష్టాలు, దుఖ్ఖం, బాధలు కలిగినప్పుడు "ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్.." అని గుండె మీద తట్టుకొని మనకి మనమే భరోసా ఇచ్చుకుంటే ఆ కష్టాల్ని సులువుగా అధిగమించ గలుగుతాము.
ఇటువంటిదే నా చిన్నప్పుడు నాకు మా తాత గారు నేర్పినది. "DONT WORRY BE HAPPY, I WILL HELP YOU.. ".
మా తాత గారు మెహెర్ బాబా భక్తులు. "DONT WORRY BE HAPPY, I WILL HELP YOU.. ". అనేది మెహెర్ బాబా గారి ప్రవచితం. కొత్త కార్యక్రమాలేవైనా ప్రారంభించేటప్పుడు, పరీక్షలు వ్రాసేటప్పుడు నాకు బాబా సహాయం ఉందనే ధైర్యం చాలా బలాన్నిచ్చేది.
రెండవది, నా స్నేహితుడు గరికపాటి శ్రీనివాస్ నుంచి గ్రాడ్యుయేషన్ రోజుల్లో నేర్చుకొన్నది.. " WHAT IS THE MAXIMUM LOSS ?? ". మనిషికి జీవితంలో అత్యంత ముఖ్యమైనది, విలువైనది అతని ప్రాణాన్ని మించినది వేరొకటి ఉండదు. ఏదేని సంధర్భంలో మనం కొన్ని రిస్కీ పనులు చేపట్టాల్సి వచ్చినప్పుడు " WHAT IS THE MAXIMUM LOSS ?? అని మనల్ని మనం ప్రశ్నించుకుంటె, ప్రాణనికి ఢోకా లేని పని ఐతే చేయవచ్చనే ధైర్యం పొందగలగటం దీని కాన్సెప్ట్.
Sunday, July 18, 2010
బాలయ్య జోక్
బాలయ్య, జూనియర్ NTR ఇద్దరికీ మార్కెట్లోకి ఏ కొత్త మోడల్ కార్ వచ్చినా కొనటం అలవాటు. వాల్వో కంపనీ కొత్తగా మార్కెట్లోకి రియర్ ఇంజిన్ మోడల్ కారు ప్రవేశపెట్టింది. బాలయ్య, జూనియర్ NTR ఇద్దరూ కలిసి చెరొకటి కొన్నారు కానీ వారికి అవి రియర్ ఇంజిన్ మోడల్ కార్లు అని తెలీదు.
ఒక రోజు పొద్దున్నే జూనియర్ NTR బాలయ్య ఇంటికి పరుగెత్తుకుంటూ వచ్చి బాలయ్య తో బాబాయ్ ..బాబాయ్.. ఉదయం నా కార్ బాన్నెట్ ఎత్తి చూస్తే ఇంజిన్ లేదు, ఎవడో ఇంజిన్ ఎత్తుకెళ్ళాడు అన్నాడు వగరుస్తూ. దానికి బాలయ్య నవ్వి.. డోంట్ వర్రీ.. నా డిక్కీ లో ఒక స్పేర్ ఇంజిన్ ఉంది అది నీకిస్తాలే అన్నాడు.
Note : not to offend fans of జూనియర్ NTR & బాలయ్య.
Monday, July 12, 2010
చిన్ననాటి స్నేహితులు.
Tuesday, July 6, 2010
హ్యుండై i10 - Magna- Automatic రివ్యూ

మూణ్ణెల్ల క్రితం నేనొక Hyundai - i10 - Magna- Automatic Car కొన్నాను. ఇది ఒక Automatic Transmission కారు. కారు డ్రైవింగ్అంత పర్ఫెక్టుగా రాని వాళ్ళకు Automatic Transmission కార్లు ఒక వరం గా చెప్పుకోవచ్చు. ఇండియాలో Automatic మోడళ్ళు చాలా తక్కువ. కానీ USలో అమ్ముడుపోయే కార్లలో ఎక్కువ శాతం Automatic కార్లే.
Maruti Suzuki మోడళ్ళలో కేవలం WAGON-R లో మాత్రమే Automatic వెర్షన్ లభిస్తుంది. Hyundai మాత్రం దాదాపుగా తన అన్ని మోడళ్ళలొ Automatic వెర్షన్లను ఉత్పత్తి చేస్తుంది. Ford, Fiat, Skoda, Honda లు కూడా కొన్ని Automatic వెర్షన్లను ఉత్పత్తి చేస్తున్నయి కానీ ఇవి High-end Luxury car మోడళ్ళలో మాత్రమే లభ్యం. చిన్న కార్లలో, Santro, Wagon-R, Hyundai i10 లో మాత్రమే Automatic వెర్షన్లు దొరుకుతాయి. వీటిలో i10 మాత్రం ఈ మధ్య బాగా పాపులర్ అయింది. ఇండియాలో Santro,Wagon-R Automatic వెర్షన్లు ఎప్పుడో ప్రవేశపెట్టబడినా వాటికి లభించిన జనాదరణ చాలా తక్కువనే చెప్పుకోవాలి. నిజానికి ఇప్పటికీ చాలామందికి Automatic Transmission కార్ల గురించి తెలియదంటే అది అతిశయోక్తి కాదు. Santor,Wagon-R Automatic వెర్షన్ లకు జనాదరణ తక్కువవటం చేత కార్లు కావాలంటే చాలా ముందుగా షోరూంలో Book చేసుకోవాల్సివచ్చేది. కానీ ఇప్పుడు ఆ అవస్థలు లేకుండా Hyundai i10 - Automatic లో కావాల్సిన రంగు,కావాల్సిన వెర్షన్ ( Magna, Sportz , Asta) రెడీ స్టాక్ లో లభిస్తున్నాయి. ఎక్కువ మొత్తంలో ఈ i10 కార్లు అమ్ముడుపోవటం చేత వీటికి Service Support, Spare parts లభ్యత సులువని భావిస్తాను.
ఇక ఈ Automatic బళ్ళు నడపటమెలాగో తెల్సుకుందాం.
Manual Transmission కార్లకి Automatic Transmission కార్లకి మధ్య కనపడే స్పష్టమైన తేడాలు రెండు. మొదటిది గేర్ పానెల్, రెండవది - క్లచ్ పెడల్ లేకపోవడం. పక్కనున్న బొమ్మలో చూపించినది Hyundai i10 గేర్ పానెల్. గేర్ రాడ్ కి ఉన్న chrome బటన్ -A క్లచ్ అన్నమాట. గేర్ రాడ్ ని ఒక గేర్ నుంచి ఇంకో గేర్ లోకి మార్చేటప్పుడు ఈ క్లచ్ బటన్ ని గట్టిగా ప్రెస్ చేసి పట్టుకొని మార్చుకోవాలి. హేండ్ బ్రేక్ వాడటంలో Automatic కి Manual కి ఏమాత్రం తేడా లేదు.
గేర్ పానెల్ మీద ఉన్న symbols చూద్దాం .
P అంటే - పార్కింగ్ మోడ్. R అంటె - రివర్స్ గేర్, N- For న్యూట్రల్ గేర్, D అంటే డ్రైవింగ్ మోడ్. "2" అంటే 2 nd గేర్, "L" అంటే లోడ్ గేర్. కారుని కేవలం P ( Parking ) గేర్లో కానీ Neutral గేర్లో కానీ ఉన్నప్పుడు మాత్రమే కీ తిప్పుకొని బండి ని Start చేసుకోవాల్సి వుంటుంది. బండిని Start చేసేటప్పుడు బ్రేక్ పెడల్ తొక్కి పెట్టడం ఉత్తమం. Start చేసాక, హేండ్ బ్రేక్ Dis-Engage చేసుకొని , క్లచ్ బటన్ నొక్కి పట్టుకొని డ్రైవింగ్ గేర్ (D) లోకి మార్చుకోవాలి. నెమ్మదిగా బ్రేక్ మీంచి కాలు తీస్తే సరి బండి ముందుకు కదులుతుంది.
Automatic బళ్ళ విషయంలో జాగ్రత్తగా వుండవలిసినది Traffic సిగ్నళ్ళ వద్ద లేదా మరెక్కడైనా బండిని ఆపాల్సి వచ్చినప్పుడు - హేండ్ బ్రేక్ engage చేయటం, బ్రేక్ పెడల్ తొక్కిపెట్టడం లేదా Neutral gear లేదా (P) పార్కింగ్ గేర్ లోకి మార్చుకోవటం తప్పనిసరి. లేక పోతే మీ బండి ఎవరినైనా గుద్దుకోవటం ఖాయం.
(P) పార్కింగ్ గేర్ :Automatic బళ్ళని పార్కింగ్ లో ఉంచేటప్పుడు ( P) Parking గేర్ లో నే ఉంచటం తప్పనిసరి.
బండి ని Start చేసెటప్పుడు కూడా పార్కింగ్ గేర్ లోనే వుంచుకోవాలి.
(R) Reverse గేర్ : Reverse చేసుకోవటానికి.
(N) Neutral గేర్ : Neutral Position.
(D) Driving గేర్ : For driving the vehicle. ఈ గేర్ లో ఉన్నప్పుడు Accelerator ని, బ్రేక్ పెడళ్ళను తొక్కడాన్ని బట్టి బండి ఆటోమాటిక్ గా ఒకటవ గేర్ నుంచి నాల్గవ గేర్ మధ్యలో దానంతట అదే మారుతూ ఉంటుంది. Car Start చేసి ఈ గేర్లోకి మార్చుకోగానే బండి ముందుకు కదలటం మొదలవుతుంది, కనుక జాగ్రత్త.
(2) 2 nd గేర్ :ఈ గేర్ లో బండి కేవలం 2nd గేర్ కి మాత్రమే పరిమితమవుతుంది కనుక ఈ గేర్ ని హైవే లపై Takeover చేయటానికి ఉపయోగిస్తారు.
(L) Load గేర్ : ఈ గేర్ లో బండి కేవలం 1 st గేర్ కి మాత్రమే పరిమితమవుతుంది కనుక ఈ గేర్ ని ఎత్తులు, కొండలు, ఘాట్ రోడ్లు ఎక్కేటప్పుడు ఉపయోగిస్తారు.
(B) Over-Drive cancelling Button : ఈ బటన్ నొక్కితే బండి Over-drive cancel అవుతుంది, బండి కేవలం ఒకటి నుంచి మూడవ గేర్ల కి మాత్రమే పరిమితమవుతుంది. కనుక దీనిని ఎత్తులు, కొండలు, ఘాట్ రోడ్లు దిగేటప్పుడు ఉపయోగిస్తారు.
ఒక సారి start చేసి Driving గేర్లోకి మారిస్తే ఇక ఆపేవరకూ కెవలం బ్రేక్, Accelerator ల తొ నే పని.
క్లచ్ ఉండదు, సిటీ ట్రాఫిక్ లో ఈ బండి నడపటం చాలా సులువు. మాటి మాటికీ గేర్లు మార్చటం, క్లచ్ తొక్కే అవసరం ఉండదు. ఎడమ కాలుకి, ఎడమ చేతికి దాదాపుగా పూర్తి విశ్రాంతి అని చెప్పవచ్చు.
Automatic బళ్ళతొ సౌకర్యాలు ఎలా వున్నా, వీటి Mileage (Fule efficiency )వీటి ప్రధాన బలహీనత. Manual కార్లతో పొల్చితే వీటి Mileage దాదాపుగా 20 శాతం తక్కువ. నా i10 కేవలం లీటరుకి 10 కి.మీ Mileage మాత్రమే ఇస్తుంది. Mileage కన్నా Mental peace / driving ease ముఖ్యం అనుకొనేవారికి Hyundai i10 - Auto ఒక మంచి option.
DISCLAIMER :
All data and information provided on this site is for informational purposes only. http://krishnarjunsblog.blogspot.com/ makes no representations as to accuracy, completeness, currentness, suitability, or validity of any information on this site and will not be liable for any errors, omissions, or delays in this information or any losses, injuries, or damages arising from its display or use. All information is provided on an as-is basis.
Sunday, July 4, 2010
HMDA- ప్లాట్ ల వేలం - ఆఖరు తేదీ 09-07-2010
A) Asifnagar (Old) - 1
B) Miyapur - 102
C) Mushk Mahal Residential Complexes - 5
D) Nallagandla - 98
E) Nandagiri Hills - 1
F) Ramachandrapuram (Chandanagar) - 20
G) Tellapur - 2
TOTAL - 229
Wednesday, June 30, 2010
పాకిస్తాన్ గజ్జెలగుఱ్ఱాలు

పాకిస్తాన్ లో ప్రైవేట్ బస్సులను ఇలా గజ్జెలగుఱ్ఱాల్లా అలంకరిస్తారు. ఎంత ఎక్కువగా అలంకరిస్తే అంత గొప్ప అన్నమాట అక్కడ. ఇండియా లో కంటే చాలా ముందుగానే పాకిస్తాన్ లో కి వోల్వో, దేవూ బస్సులు ప్రవేశించాయి. అయినా అక్కడ ఇలాంటి గజ్జెలగుఱ్ఱాలకి ఆదరణ ఏ మాత్రం తగ్గలేదు. అక్కడ CNG లభ్యత చాలా ఎక్కువ, కనుక ఇప్పుడు అక్కడ చాలావరకు CNG బస్సులు కనిపిస్తున్నాయి.
Tuesday, June 29, 2010
Encumberance Search
Encumberance Certificate కోసం రిజిస్ట్రేషన్ ఆఫీస్ చుట్టూ తిరగనక్కరలేదిక.
మీరింక ఇంటివద్దనుంచే సెర్చ్ చెసుకోవచ్చు.
కింది లింక్ క్లిక్ చేయండి.
Sunday, June 27, 2010
జపనీస్ వెండింగ్ మెషీన్లు

జపాన్ ను ప్రపంచంలో అత్యధికంగా వెండింగ్ మెషీన్లను వాడే దేశంగా చెప్పుకోవచ్చు. అక్కడ ప్రతీ 23 మందికి ఒక వెండింగ్ మెషీన్ ఉన్నట్టు ఒక అంచనా. ఈ మెషీన్లను సాఫ్ట్ డ్రింక్స్, గ్రీన్ టీ, ఐస్ క్రీం, న్యూస్ పేపర్స్, మేగజైన్స్,సిగరెట్స్,బీర్లు మొదలైనవాటిని అమ్మటానికి వాడుతారక్కడ. ఫుట్ పాత్ ల పై ఎక్కడ పడితే అక్కడ ఇవి వరుసగా కనిపిస్తాయక్కడ. అక్కడ దొంగలు వీటి జోలికి రారు అందుకే అక్కడ అవంతగా సక్సెస్ఫుల్ అయ్యాయి. కాయిన్లే కాదు నోట్లను కూడా ఇవి స్వీకరించి కరెక్ట్ చిల్లర తిరిగి ఇస్తాయి. హోటళ్ళ లొ ప్రతీ ఫ్లోర్లో వీటిని ఏర్పాటు చేస్తారు అక్కడ. రూం సర్వీస్ వాళ్ళని డిస్టర్బ్ చేయక్కర లేదు. మనంతట మనం కావల్సినప్పుడల్లా కావల్సిన డ్రింక్ ఈ మషీన్ల నుంచి తీసుకోవచ్చు. పక్కనున్న ఫోటో మీరు గమనిస్తే, 500 మి.లీ సాఫ్ట్ డ్రింక్ బాటిల్ ఖరీదు 120 యెన్లు. అంటే ఇండియన్ కరెన్సీ లో 60 రూ.లూ. దాదాపుగా మన రేట్ల కంటే రెండు రెట్లు.
Saturday, June 26, 2010
జపనీస్ కాప్స్యూల్ హొటళ్ళు
జపనీస్ హొటళ్ళు:
జపాన్ లో భూమి చాలా ఖరీదు, టొక్యో లాంటి సిటీ లో ఐతే అడుగు స్థలం దొరకడమే మహ గగనం. హొటల్ చార్జీలు గూబ గుయ్యిమనిపిస్తాయి. పైగా హొటల్ రూములు చాలా చిన్నవిగా ఉంటాయి. కాని ఆ చిన్న ప్రదేశం లోనే అన్ని సౌకర్యాలను పొందుపరుస్తారు. మేము దిగింది హొటల్ కందా స్టేషన్ హొటల్.రూం చిన్నదే.టాయిలెట్ ఐతే మరీ 3" x 5" సైజు లో ఉంది. అందులోనే బాత్ టబ్ కూడా ఏర్పాటు చేసారు. సబ్బు బిళ్ళల బదులుగ లిక్విడ్ సొపు ఉంచారు. సబ్బు బిళ్ళలు వేస్టు గాకుండా మంచి పద్దతి. లాండ్రీ లేదు ఆ హోటల్లో, ఒక చోట ఒక చిన్న వాషింగ్ మెషీను ఏర్పాటు చేసారు. మనమే ఉతుక్కోవాలన్నమాట !!. రూం రెంట్ రోజు కి 5000 రూ.లు. టీవీ లో కొన్ని ఫ్రీ చానెల్స్ మాత్రమే వస్తాయి. పెయిడ్/ పోర్న్ చానెల్స్ చూస్తే హొటల్ బిల్లు మోతమోగుద్ది. హొటల్నుంచి ఫొను మాట్లాడినా అంతే సంగతులు.

జపనీస్ కాప్స్యూల్ హొటళ్ళు :
పక్క ఫొటోల్లొని పెట్టెలను చూసారుగా. ఇవీ కాప్స్యూల్ హొటళ్ళంటే. రోజుకి 1500 రూ.ల అద్దె తో లభిస్తాయివి. చిన్న చిన్న వ్యాపారస్తులకీ, టూరిస్టులకీ, దగ్గరలో పనిచేసే ఉద్యోగస్తులకీ ఇవి వాళ్ళ బడ్జెట్లో దొరుకుతాయి.ఇక్కడ ఉద్యోగస్తులు ఆఫీసుల్లో ఎక్కువ సమయం గడుపుతారు,ఆఫీసు సమయం దాటినా సీట్లకే అతుక్కొని వుంటారు. చీకటి పడ్డాక తమ సహోద్యోగులతో లేదా ఉన్నతోద్యోగులతో బార్లు,రెస్టారెంట్లలో గడుపుతారు. అర్ధరాట్రి దాటితే లొకల్ ట్రైన్లు దొరకవు, దూరంగా ఉండే తమ గ్రుహాలకు వెళ్ళలేక రాత్రుళ్ళు ఈ కాప్స్యూల్ హొటళ్ళలో గడుపుతారు. 2 మీ x 1 మీ x 1మీ సైజు ఉండే ఈ కాప్స్యూల్ పెట్టెల్లో టీవీ, రేడియో, అలారం తదితరాలు ఉంటాయి. స్నానాల గదులు మాత్రం కామన్ గా ఉంటాయి.
Friday, June 25, 2010
हम को मन की शक्ति देना
हम को मन की शक्ति देना, मन विजय करेदूसरों की जय से पहले ख़ुद को जय करेहम को...भेद भाव अपने दिल से साफ़ कर सकेदोस्तों से भूल हो तो माफ़ कर सकेझूठ से बचे रहे, सच का दम भरेदूसरों की जय से पहले ख़ुद को जय करेहम को मन की शक्ति देना, मन विजय करेदूसरों की जय से पहले ख़ुद को जय करेमुश्किलें पड़ें तो हम पे इतना कर्म करसाथ दें तो धर्म का, चलेंगे धर्म परख़ुद पे हौसला रहे, बदी से न डरेदूसरों की जय से पहले, ख़ुद को जय करेहम को मन की शक्ति देना, मन विजय करेदूसरों की जय से पहले ख़ुद को जय करे
Translation in English :
Please grant us the power over our minds so that the mind may score a victory over itself before it can score victory over others.
We pray to eschew all ill feelings from our hearts.
Give us the power to forgive our friends when they err.
Save us from lies, and stick to the truthIf we face any hazards,
God do this favour, Let us support 'Dharma' and let us walk on the path of 'Dharma'
Let us retain faith in ourselves and not succumb to evil.
SOURCE : YOUTUBE
జపనీస్ పంక్ట్చువాలిటీ
మేము టోక్యో లో ఒక ట్రేడ్ ఫెయిర్ లో ఎగ్సిబిట్ చేయడానికి వెళ్ళాము. అక్కడ స్టాల్లో ఉండగా చూసాము,మాకు అప్పాయింట్మెంట్ ఇచ్చిన వ్యక్తి అప్పాయింట్మెంట్ టైముకన్నా 5 నిమిషాలు ముందుగా మా స్టాలు వద్దకు వచ్చినప్పటికీ, మేము స్టాల్లొ ఖాలీగా గోళ్ళు గిల్లుకుంటూ కూర్చున్నప్పటికీ అతను స్టాల్ల్ లోనికి రాలేదు. ఖరక్టుగా అప్పాయింట్మెంట్ టైముకి అతను స్టాల్లోకి వచ్చి కూర్చొన్నాడు. అదీ వాళ్ళ టైం పంక్చువాలిటీ.
జపనీస్ బుల్లెట్ ట్రైన్
ముంబయి లోకల్ ట్రైన్
ఈ వీడియో చూస్తే మాత్రం ముంబయి లోకల్ ట్రైన్ కంటే జపాన్ లోకల్ ట్రైన్ వెయ్యి రెట్లు బెటర్ అనిపిస్తుంది.
నా జపాన్ టూర్ విశేషాలు - Part 1
బంగ్లాదేశ్, పాకిస్తాన్ల కు మన దేశానికి పెద్దగా తేడాలు కనిపించవు మరియు భాషాపరమైన ఇబ్బందులేమీ పెద్దగా ఉండవు. కానీ ఫ్రాన్స్,స్పెయిన్,జపాన్లలో మాత్రం భాష ఆర్థం గాక చాలా కష్టపడాల్సి వచ్చింది. భాషే కాదు భోజన విషయంలో కూడా అంతే కష్టపడాల్సి వచ్చింది.వెజిటేరియన్ల కైతే మరీ కష్టం.ఈ దేశాల్లో భోజనం దగ్గర వాళ్ళ కష్టాలు పగవాడికి కూడా వద్దనిపిస్తాయి.
ఇక జపాన్ విశేషాలకి వస్తే, రేపు ముంబాయి లో ఫ్లైటు అనగా ఇవ్వాళ సాయంత్రం మాకు జపాన్ వీసా దొరికింది. కానీ మా పాసుపోర్ట్లు చెన్నై ఎంబసీ లో...??!!! కష్టం మీద ఒక స్నేహితుడు సహాయపడి మా పాసుపోర్ట్లు రాత్రికి రాత్రి హైదరాబాద్ కి ఫ్లైట్ లో తీసుకురావడంతో ఈ ప్రయాణం సాధ్యపడింది. లాస్ట్ మినిట్లో ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకోవడం, ఇన్సూరెన్స్, డాలర్లు కొనుక్కోవటం, ఆదరాబాదరాగా బట్టలు సర్దుకోవటం నా జీవితంలో మర్చిపోలేను.
తర్వాత రోజు మధ్యాహ్నం 12 గంటల కల్లా మేము ముంబాయి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు లో ఉన్నాము. అక్కణ్ణుంచి థాయ్ ఎయిర్ లైన్స్ ఫ్లైట్లో బ్యాంకాక్ కి, బ్యాంకాక్ లో 3 గంటల వెయిటింగ్ తర్వాత అక్కణ్ణుంచి థాయ్ ఎయిర్ లైన్స్ ఫ్లైట్లో ఓసాకా, కన్సాయి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు, జపాన్ చేరుకున్నాం. కన్సాయి ఎయిర్‌పోర్టు ఒక ద్వీపంగా చెప్పుకోవచ్చు.ఒసాకా నుంచి దాదాపు 50 కి.మీ దూరంలో దీన్ని నిర్మించారు.దీనిని లాండ్ రిక్లయిం చేసి కట్టారు.
ఎయిర్‌పోర్టు నుంచి కాలు బయట పెట్టగానే నా కంటబడింది ఏమిటంటే పబ్లిక్ స్మోకింగ్ ఏర్పాట్లు. ఒక చోట తెల్ల రంగులో గడి గీసిన చొట యాష్ ట్రే స్తాండులు ఉన్నాయి. స్మోకింగ్ చేసేవారంతా ఆ గడిలోనే నిలబడి స్మోక్ చేయాలి. బజార్లలో కూడా కొన్ని చోట్ల చిన్న చిన్న సందుల్లో స్మోకర్లకి ప్రత్యేక ప్రదేశాలున్నాయి. ట్రైన్లలో కూడా కొన్ని పెట్టెల్లొ స్మొకింగ్ పర్మిటెడ్,. డిస్ప్లే సిస్టంలో ఏపెట్టెలో స్మోకింగ్ పెర్మిటెడొ డిస్ప్లే అవుతూంటూ ఉంటుంది. జపాన్ వాతావరణం చల్లగా ఉంది ( ఏప్రిల్ నెలలో). దాదాపుగా ప్రతి ఒక్కరూ సూట్లను ధరిస్తారు. మరీ చల్లని ప్రదేశాలలో ట్రైన్లలో హాట్ ఏర్ సర్కులేషన్ ఉంటుంది.
జపాన్ వాసులు చాలా మర్యాదస్తులనే చెప్పుకోవాలి. వగి వంగి దణ్ణాల్లు పెడతారు.అది వాళ్ళ గ్రీటింగ్ పద్దతి.
ఆడవాళ్ళు మరీ ఎక్కువగా కనిపించరు. ఉద్యోగాలు చేసే ఆడవారి శాతం తక్కువే. అక్కడ టాక్సీలు చాలా ఖరీదు. ఆ మాటకొస్తె జపాన్లో అన్నీ ఖరీదనే చెప్పాలి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టం చాలా బాగుంది.ఎయిర్‌పోర్టు ఆవరణలోనే మెట్రో ట్రైన్ స్తేషన్లతో ఎంతొ సౌకర్యంగా అనిపించాయి.
కన్సాయి ఎయిర్‌పోర్టునుంచి షిన్ ఒసాకా స్టేషన్ కి గంట ప్రయాణం. ట్రైన్ స్టేషన్ కి బయట ఉన్న ఎలక్ట్రానిక్ కియోస్కులలో ఇండియన్ క్రెడిట్ కార్డులతొ సులువుగా టికెట్లు తీసుకోగలిగాం. గంట ప్రయాణానికి దాదాపుగా 1400 రూపాయలు ( 2800 యెన్లు ) మనిషికి ఖర్చు.
ట్రైన్లలో రిజర్వుడు, అన్రిజర్వుదు టికెట్లు దొరుకుతాయి. ఫేర్లలో కొద్దిగా తేడా ఉంటాయి వీటికి. ట్రైన్ సర్వీసులన్నీ ప్రయివేటైజ్డ్. ఇదే దూరానికి ఒకవేళ మేము టాక్సీ చేసుకొనిఉంటే దాదాపుగా ఏడువేలు క్షవరం అయివుండేవి. టాక్సీ ఎక్కి దిగితే, అంటె 2 కి.మీ మినిమం దూరానికి 350 రూ.లు ఫిక్స్డ్ చార్జ్. ఆపై కి.మీ ఒక్కింటికి 100 రూ.లు అదనం.
ట్రైన్లలో టికెట్ ఎక్జామినర్ బోగీ లో కి వచ్చేటప్పుడు, బోగీ లోంచి వెళ్ళిపోయేటప్పుడు వంగి బొఓగీ లోని అందరికి అభివాదం చేయటం,ప్రతీ పాసింజర్ ని మర్యాద పూర్వకంగా గ్రీట్ చేసి టికెట్ అడగడం నన్ను బాగా అలరించిన విషయం. రద్దీ సమయాల్లో జపాన్ ట్రైన్లకు ముంబయి లోకల్ రైళ్ళకు పెద్దగా తేడా వుండదు. జనాలు ఒక పద్దతిగా ప్లాట్ఫారం మీద క్యూ లో నిలబడటం తప్ప.
షిన్ ఒసాకా లో దిగి మా క్లయింటు నొకరిని కలిసి తిరిగి రైల్ స్టేషన్ కి వచ్చాము. మా జపాన్ ఏజెంట్ అక్కడ మమ్మల్నక్కడ ఒక రెస్టారెంట్ కి తీసుకెళ్ళాదు. రెస్టారెంట్ లో కి అడుగుపెట్టగానే వాళ్ళు మమ్మల్ని అడిగిన మొదటి విషయం స్మోకింగా, నాన్ స్మోకింగా అని. ఇంకో జపాన్ ప్రత్యేకత ఏమిటంటే రెస్టారెంట్ లో, టాక్సీల్లొ కస్టమర్లు రాగానే వారికి వెట్ / హాట్ టవల్ ఆఫర్ చెయ్యటం. మన దగ్గర కొన్ని ఎయిర్‌లైన్సు వాళ్ళు ఆఫర్ చేయటం మీరు చూసేవుంటారు. అది అక్కడ ఒక పెద్ద బిజినెస్.
రెస్టారెంట్ లో చాప్ స్టిక్కులతో మా విన్యాసాలు, అవస్థలు చూడలేక మా ఏజెంట్ మాకోసం ఫోర్క్, స్పూను తెప్పించి ఇచ్చాడు.జపనీస్ నూడుల్స్ ఆ ఫోర్క్, స్పూన్లకు ఏమాత్రం లొంగలేదు. నానా అవస్థలూపడి ఏదోలా భోజనం అయ్యింది అనిపించాము. తరువాత మా ఏజెంట్ కి టాటా బై బై చెప్పి టోక్యో కి బుల్లెట్ ట్రైన్లో బయల్దేరాము. ఒసాక నుంచి టోక్యో దాదాపు 515 కి.మీ. ఒసాక - టోక్యో బుల్లెట్ ట్రైన్ సర్వీసుని "షిన్ కాన్సెన్" అని అంటారు. 515 కి.మీ దూరాన్ని ఇవి రెండున్నర గంటల్లో పూర్తిచేస్తాయి. ఒసాక నుంచి టోక్యో కి ఈ బుల్లెట్ ట్రైన్ ఫేర్ దాదాపుగా 7500 రూ.లు. ఎయిర్ ఫేర్ తొ సమానం. కానీ చాలామటుకు అందరూ ట్రైనే ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటె ఎయిర్ పోర్ట్లు సిటీ కి దూరంగా ఉండటం, చెకింగ్, బోర్దింగులకు చాలా సమయం పట్టడం మొదలైన కారణాల వల్ల. ట్రైన్లలో సీట్లకు ట్రే టేబుళ్ళు ఉండటమేకాదు, కావాలంటే సీట్లను వెనక్కు జరుపుకోవచ్చు, వెనక్కు తిప్పుకోవచ్చుకూడా. ట్రైన్లు అన్నీ వైఫయి ఎనేబుల్డ్.ట్రే టేబుళ్ళ మీద లాప్ టాప్ పెట్టుకొని పనిచేసుకోవదానికి వీలుగా ఉంటాయి. కొన్ని డబుల్ డెక్ భోగీలలో చిన్న లిఫ్ట్ కూడా వుందటం చూసాను. లగేజీ ని పైకి మోసుకెళ్ళనక్కర్లేకుండా ఈ లిఫ్ట్ లను వాడుకోవచ్చు.రైల్వే స్టేషన్లలో మన స్వీట్ బాక్స్ లాగ ఉండే లంచ్ బాక్స్ లు అమ్ముతారు, వివిధ రకాలైన కాంబినేషన్లలో ఇవి దొరుకుతాయి. ఖరీదు దాదాపు 350 రూ.లు. మరో జపాన్ ప్రత్యేకత ఏమిటంటే గ్రీన్ టీ.
500 మి.లీ బాటిల్ గ్రీన్ ట్రీ 60 రూ.లు ఉంటుంది. అందరూ మంచి నీళ్ళకు బదులు గ్రీన్ టీ తాగుతారు. గ్రీన్ టీ ఆరోగ్యానికి మంచిదని వారి నమ్మకం. ఈ గ్రీన్ టీ చాల రకాల ఫ్లేవర్లలో దొరుకుతుంది. జనాలు ఒక లంచ్ బాక్స్, గ్రీన్ టీ బాటిల్ కొనుక్కొని ట్రైన్ ఎక్కి, ట్రే టెబుల్ మీద పెట్టుకొని తినేసి,ఖాళీ డబ్బాలను, ఖాళీ బాటిళ్ళను ప్లాస్టిక్ కవర్లలో బిగించి స్టేషన్లో దిగాక అక్కడ వుండే ట్రాష్ బిన్ లలో వేసేస్తారు.ఈ ట్రాష్ బిన్లలో వేసేటప్పుదు మనం చెత్తని సెపరేటు చేసి వేయాల్సివుంటుంది. రీసైక్లింగ్ కి సెగ్రగేషన్ కీ సులువుగా ఉండడానికి ఆ ఏర్పాటు.
Tuesday, June 22, 2010
పాకిస్తాన్ ఇండియా కి చేసిన మేలు
పాకిస్తాన్ సానియా మీర్జా ని తీసుకెళ్ళింది
ఖతార్ యం.ఎఫ్.హుస్సేన్ ను తీసుకెళ్ళింది
రాఖీ సావంత్ ని కూడా ఎవరన్నా తీసుకెళ్ళండి రా బాబూ...
Monday, June 21, 2010
Sunday, June 20, 2010
అరిషడ్వర్గములు - త్యాగయ్య సినిమా నుంచి
కామ,క్రోధ,లోభ,మోహ,మద,మాత్సర్యాదులు చుట్టుముట్టినప్పుడు భాగవతోత్తములైన ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక,వ్యాస,అంబరీష,శుక,శౌనక, భీష్మ,రుక్మాంగద,అర్జున,వశిష్ట,విభీషణాదులను తలచుకొన్నంత అవి పటాపంచలవును.
సినీ నటుడు "కోటా శ్రీనివాస రావ్" కుమారుడు "కోటా ప్రసాద్" దుర్మరణం
Saturday, June 19, 2010
Happy fathers day
Friday, June 18, 2010
తెలుగులో టైపు చేయడానికి software
తెలుగులో టైపు చేయడానికి www.sirigina.com/telugulipi.aspx
లేదా http://www.lekhini.org/ కాని http://www.baraha.com/ విజిట్ చేయండి. http://www.sirigina.com/ నుంచి Telugu Lipi software, Fonts download చేసుకోవచ్చు.
Monday, June 14, 2010
LRS scheme extended
Layout Regularisation scheme గడువు 31-12-2010 వరకు పొడిగించబడింది.
ఇంతకుముందు అప్లై చేయని వారికి ఇది మరొక అవకాశం.
బాపు - పెళ్ళిపుస్తకం సినిమా కొటేషన్లు
నాకు బాగా నచ్చిన సినిమాలలో బాపు - పెళ్ళిపుస్తకం ఒకటి.అందులోని కొన్ని డైలాగులు / బాపు కొటేషన్లు నాకు బాగా నచ్చాయి. నేను చాలా సంధర్భాలలో వాటిని కోట్ చేస్తూఉంటాను కూడా. అవి...
1) అసూయ ఘాటైన ప్రేమకి థెర్మామీటర్ వంటిది.
2) మంచి చెడ్డలు రాశులు పోసినట్లు వేరు వేరు గా ఉండవు. అవసరాన్నిబట్టి మంచితనం అవకాశాన్నిబట్టి చెడ్డతనం పెరుగుతాయి.
3) నమ్మకం లేని చోట నారాయణా అన్నా బూతు మాటలాగా వినిపిస్తుంది అదే నమ్మకమున్నచోట బూతు కూడ నారాయణా అన్నట్టు ఉంటుంది.
4) అవకాశాన్నిబట్టి మంచివాళ్ళు చెడ్డవాళ్ళవచ్చు, అవకాశం లేకపోతే చెడ్డవాళ్ళుకూడా మంచివాళ్ళుగా మిగిలిపోవచ్చు. వౄద్ధ నారీ పతివ్రతహా
5) తగాదాలు లేని జీవితం పోపు లేని సాంబారు లాగా ఉంటుంది.
Sunday, June 13, 2010
People are corrupt ( ప్రజలే అవినీతిపరులు )
నేను రెగ్యులర్ గా ఫాలో అయ్యే బ్లాగుల్లో "ఆంధ్రప్రదేశ్ మీడియా కబుర్లు" ఒకటి. ఈమద్య అందులో, రాము గారు TV1 లోని ఒక ప్రోగ్రాము గురించి, మీడియాలో ని పోకడల గురించి వ్రాసారు. ఆ పోస్టింగులు, ఆ కామెంట్లు, అనామికల గాళ్ళ కామెంట్లు చదివాక నాకో ప్రోగ్రాము చెయ్యాలనిపిస్తుంది. దాని టైటిల్ "People are corrupt". మనం ఇంట్లో కూర్చుని అనుకుంటూ ఉంటాము, ఈ పొలిటీషియన్లు, బిజినెస్ మాన్లు, అధికారులు అంతా అవినీతిమయం అని, కాని నిజానికి మనమంతా, మనలోని ప్రతి ఒక్కరు ఏదో ఒక రకంగా అవినీతిపరులమే. వీటన్నిటిని ( మనలోని కుళ్ళు, అవినీతులను ) బహిరంగపరుస్తూ, ముందుగా మనం మారలని తెలియచేస్తూ ఆ ప్రోగ్రాము ఉండాలన్నది నా ఆలోచన.
ఈ సంధర్భంలో నాకు బాపు - పెళ్ళిపుస్తకం సినిమాలోని డైలాగు గుర్తుకొస్తూంది.
"మంచి చెడు అనేవి రాశుల్లా పోసి ఉండవు.. మంచి వాడు అవసరం కొద్దీ /అవకాశం వస్తే చెడ్డ వాడిగా మారచ్చు.. చెడ్డ వాడు అవకాశం లేక/ రాక మంచి వాడు గా మిగిలిపోవచ్చు". ( వ్రుద్ధ నారీ పతివ్రతహా )
తెలుగు నటి డింపుల్ అరెస్టు
విషాదం ఏమిటంటే, ఈ కాలం యువతి అయిఉండి కూడా, పెళ్ళి కోసం ఇంతగా తాపత్రయపడటం, పెళ్ళేపరమావధి అన్నట్టుగా, శ్రీధర్ తప్పితే ఇంకెవరూ దొరకరన్నరీతిలో నేరానికి తెగించడం, ఒక తప్పు కప్పిపుచ్చడానికి ఇంకో తప్పు చేయడం.
Moral of the story : Crime never pays.
http://ibnlive.in.com/news/andhra-tv-actress-held-for-attack-on-fianc/124112-8-69.html?from=tn
Saturday, June 12, 2010
నాకు నచ్చిన, నేను అనుసరించే ఒక చందమామ కథ.
ఒకానొక గ్రామంలో రామయ్య అనే గ్రామపెద్ద ఉండేవాడు, అతనికి ఆ గ్రామంలోనే కాకుండా ఆ చుట్టుపక్కల గ్రామాలలొ కూడ మంచి పేరు ఉండేది. అందరూ తమ సమస్యలను అతనికి చెప్పి ఆయన సలహలు తీసుకునేవారు. కొన్నాళ్ళకు రామయ్య మరణించాడు.అతని కొడుకులైన శీనయ్య, సీతయ్యలు గ్రామపెద్దలు గా వ్యవహరించేవారు.గ్రామ ప్రజలు వారి వద్దకు తమ తమ సమస్యలతో రాసాగారు. కొన్నాళ్ళకు శీనయ్య వద్దకు వచ్చే వారు క్రమంగా తగ్గిపోసాగారు.మరోపక్క సీతయ్య వద్దకు వచ్చే వారి సంఖ్య పెరగసాగింది.చుట్టుపక్కల గ్రామాలలో సీతయ్యకి మంచి పేరు రాసాగింది.
తన దగ్గరకు వచ్చేవారు తగ్గటం చూసి, శీనయ్య తన సొదరుడైన సీతయ్య వద్దకు వెళ్ళి ఈ విషయం చెప్పి తన వద్దకు జనం ఎందుకు రావటం లేదు కారణం ఏమై ఉంటుందని అడిగాడు.
దానికి సీతయ్య నవ్వి, సోదరా,సలహల కోసం మనవద్దకు వచ్చేవారిలో చాలామటుకు మంది ముందుగానే ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకొనే వస్తారు. అందుకే నెను నా వద్దకు వచ్చేవారి సమస్య విన్నాక ముందుగా వారేమిచేద్దామనుకుంటున్నారో అడిగి తెలుసుకుంటాను. కాస్త అటూ ఇటూగా వారు చేద్దామనుకుంటున్నదానినే నేను వారికి సలహాగా ఇస్తాను. వారు చేద్దామనుకుంటున్నదానిని సమర్ధించడం వల్ల మనం మంచి సలహ ఇచ్చామన్న భావన వారికి, మన సలహ మన్నించారనే త్రుప్తి మనకి కలుగుతుంది అన్నాడు.
సోదరుడి సలహా పాటించి శీనయ్య కూడా త్వరలోనే మంచి పేరు సంపాదించుకున్నాడు.
చిన్నప్పుడు చందమామ లో చదివిన ఈ కథ నాకు బాగా గుర్తుండే, నేను పక్కగా అనుసరించే నీతి కథ.
మేడిపండు వ్యాపారాలు
భారతదేశం లో ఏ వ్యాపారాన్ని తీసుకున్నా,న్యాయం గా,ధర్మంగా చేస్తే అవి గిట్టుబాటుగా ఉండవని నాకు అనిపిస్తూంటుంది. నాకు ఎదురైన కొన్ని ఉదాహరణలు.
1) మా పక్క కాలనీలో ఒక స్వీట్ షాపు ఉంది.చిన్న కాలనీకి ఆ స్వీట్ షాప్ అవసరమా అనిపించేది, రోజుకి నలుగురో, ఐదుగురోకస్టమర్లు వచేవారు. ఆ మాత్రం కస్టమర్లకి బిజినెస్ ఏవిధంగా గిట్టుబాటు అవుతుందో అని నా డౌటు. ఒక రోజు రాత్రి నాకు అర్ధం అయ్యింది ఆ షాపు ఎలా నడుస్తుందో, ఆ షాపులో స్వీట్లు,సాఫ్త్ డ్రింకులతోబాటుగా బీర్లు అమ్ముతారు. అసలు కస్టమర్లు వచ్చేది రాత్రి పది దాటిన తరువాత అదీ బీర్లు, విస్కీలు కొనడానికి. అదీ సంగతి
2)అదే కాలనీలో ఒక స్వగ్రుహా షాపు ఉంది.మేము రెగ్యులర్ గా కారా, మిక్చర్లు గట్రా కొంటామా షాపులో. ఒక సారి ఆ షాపు కి వెళ్తే మిక్చర్ లేదు, రేషన్ బియ్యం ఇంకా రాలేదు వచ్చాక మిక్చర్ చేస్తాము అని అన్నారు. రెండు రూపాయల బియ్యం, సబ్సిడీ గ్యాస్,కిరోసిన్ లేకుంటే ఆ వ్యాపారం కూడా గిట్టుబాటు గాని వ్యాపారం అన్నమాట.
3)ఎగస్ట్రా ఫ్లోర్లు,సెల్లార్లో ఫ్లాట్లు,పెంట్ హౌస్ లు కట్టి అమ్ముకోకపోతే బిల్డర్లకు గిట్టుబాటు కాదు. ఎకరం 2 కోట్లు పెట్టి కొంటే, పునాదులకని తవ్విన మట్టి అమ్ముకుంటే దాదాపుగా 20లక్షలు ఆదాయం వస్తుంది.
4) రెండు రోజుల క్రితం మనం చూసిన లిక్కర్ షాపు టెండర్లలోను అంతే. ఒక్కో షాపుని కోట్లల్లొ పాడారు.నల్ల డబ్బుని తెల్లగా మార్చుకోవడానికే అంతగా ఖర్చు చేసారని వినికిడి.
5) ఇక ఫార్మా కంపెనీల గురించి చెప్పక్కర్లేదు, chemial waste ఎక్కడయినా పారబోయక పొతే వాటికి గిట్టుబాటు కాదు.
6) TV చానెల్స్ కి ఐతే Paid news, yellow journalism అసలైన రాబడి మార్గాలు.
ఇవి మచ్చుకి కొన్ని మాత్రమే. తరచి తరచి చూస్తే అన్ని వ్యాపారాల పరిస్థితి ఇంచుమించుగా ఇంతే అనిపిస్తుంది.
Thursday, June 10, 2010
Wednesday, June 9, 2010
It happens only in Hyderabad
Introduction to my blog
వౄత్తి రీత్యా నేను Pharma sales person ని, వౄత్తి కి సంభంధించి చాలా కాలం క్రితమే నేను కొన్ని Blogs ప్రారంభించినా, ప్రవ్రుత్తి ని, బాషాభిమానాన్ని చాటుకోవడానికి, నా అభిప్రాయాలు వ్యక్తం చేసుకొవదానికి, తెలుగు లో ఈ Blog ని ఆరంభిస్తున్నాను.
ఇది, అది అని ఏ ఒక్క దానికో పరిమితం కాకుండా ఫార్మా నుంచి మీడియా, పాలిటిక్స్,సినిమా, రియల్ ఎస్టేట్ దాకా నాకు అభిరుచి ఉన్న అన్ని విషయాలను స్ప్రుశించనున్నాను.
మీ
క్రిష్ణ
Tuesday, June 8, 2010
Hetero Drugs - CMD - పార్థసారథి గారి కుమారుడి వివాహం


Hetero Drugs - CMD - పార్థసారథి గారి కుమారుడి వివాహం
నా జీవితం లో నే అతి ఖరీదయిన పెళ్లిని చూదటం.Hyderabad లోని HITEX ప్రాంగణం లొ గత ఆదివారం నాడు అతి వైభవంగా జరిగింది. ఈ పెళ్లికి దాదాపుగా 50 కోట్లు ఖర్చు చేసారని విన్నాను. మొత్తం 15000 మంది ఈ పెళ్లికి హాజరు అయ్యారు. ఎక్కువమంది ఆ సంస్థ లో పని చేసే ఉద్యోగస్థులు వారి కుటుంబ సభ్యులు, customers, suppliers హాజరు అయ్యారు. ఇది 4 రోజుల కార్యక్రమం. ఆదివారం పెళ్లి, అదే రాత్రి చౌమొహల్లా పాలస్ లో విందు, తరువాతి రోజున Novotel Hotel లో విందు,ఆ తరువాతి రోజున Gachibowli stadium లో విందు,తరువాతి రోజున వారి స్వస్థలం Sattupalli లో విందు. మీ కోసం కొన్ని ఫోటొలు.

