ఒకానొక గ్రామంలో రామయ్య అనే గ్రామపెద్ద ఉండేవాడు, అతనికి ఆ గ్రామంలోనే కాకుండా ఆ చుట్టుపక్కల గ్రామాలలొ కూడ మంచి పేరు ఉండేది. అందరూ తమ సమస్యలను అతనికి చెప్పి ఆయన సలహలు తీసుకునేవారు. కొన్నాళ్ళకు రామయ్య మరణించాడు.అతని కొడుకులైన శీనయ్య, సీతయ్యలు గ్రామపెద్దలు గా వ్యవహరించేవారు.గ్రామ ప్రజలు వారి వద్దకు తమ తమ సమస్యలతో రాసాగారు. కొన్నాళ్ళకు శీనయ్య వద్దకు వచ్చే వారు క్రమంగా తగ్గిపోసాగారు.మరోపక్క సీతయ్య వద్దకు వచ్చే వారి సంఖ్య పెరగసాగింది.చుట్టుపక్కల గ్రామాలలో సీతయ్యకి మంచి పేరు రాసాగింది.
తన దగ్గరకు వచ్చేవారు తగ్గటం చూసి, శీనయ్య తన సొదరుడైన సీతయ్య వద్దకు వెళ్ళి ఈ విషయం చెప్పి తన వద్దకు జనం ఎందుకు రావటం లేదు కారణం ఏమై ఉంటుందని అడిగాడు.
దానికి సీతయ్య నవ్వి, సోదరా,సలహల కోసం మనవద్దకు వచ్చేవారిలో చాలామటుకు మంది ముందుగానే ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకొనే వస్తారు. అందుకే నెను నా వద్దకు వచ్చేవారి సమస్య విన్నాక ముందుగా వారేమిచేద్దామనుకుంటున్నారో అడిగి తెలుసుకుంటాను. కాస్త అటూ ఇటూగా వారు చేద్దామనుకుంటున్నదానినే నేను వారికి సలహాగా ఇస్తాను. వారు చేద్దామనుకుంటున్నదానిని సమర్ధించడం వల్ల మనం మంచి సలహ ఇచ్చామన్న భావన వారికి, మన సలహ మన్నించారనే త్రుప్తి మనకి కలుగుతుంది అన్నాడు.
సోదరుడి సలహా పాటించి శీనయ్య కూడా త్వరలోనే మంచి పేరు సంపాదించుకున్నాడు.
చిన్నప్పుడు చందమామ లో చదివిన ఈ కథ నాకు బాగా గుర్తుండే, నేను పక్కగా అనుసరించే నీతి కథ.
No comments:
Post a Comment