
మూణ్ణెల్ల క్రితం నేనొక Hyundai - i10 - Magna- Automatic Car కొన్నాను. ఇది ఒక Automatic Transmission కారు. కారు డ్రైవింగ్అంత పర్ఫెక్టుగా రాని వాళ్ళకు Automatic Transmission కార్లు ఒక వరం గా చెప్పుకోవచ్చు. ఇండియాలో Automatic మోడళ్ళు చాలా తక్కువ. కానీ USలో అమ్ముడుపోయే కార్లలో ఎక్కువ శాతం Automatic కార్లే.
Maruti Suzuki మోడళ్ళలో కేవలం WAGON-R లో మాత్రమే Automatic వెర్షన్ లభిస్తుంది. Hyundai మాత్రం దాదాపుగా తన అన్ని మోడళ్ళలొ Automatic వెర్షన్లను ఉత్పత్తి చేస్తుంది. Ford, Fiat, Skoda, Honda లు కూడా కొన్ని Automatic వెర్షన్లను ఉత్పత్తి చేస్తున్నయి కానీ ఇవి High-end Luxury car మోడళ్ళలో మాత్రమే లభ్యం. చిన్న కార్లలో, Santro, Wagon-R, Hyundai i10 లో మాత్రమే Automatic వెర్షన్లు దొరుకుతాయి. వీటిలో i10 మాత్రం ఈ మధ్య బాగా పాపులర్ అయింది. ఇండియాలో Santro,Wagon-R Automatic వెర్షన్లు ఎప్పుడో ప్రవేశపెట్టబడినా వాటికి లభించిన జనాదరణ చాలా తక్కువనే చెప్పుకోవాలి. నిజానికి ఇప్పటికీ చాలామందికి Automatic Transmission కార్ల గురించి తెలియదంటే అది అతిశయోక్తి కాదు. Santor,Wagon-R Automatic వెర్షన్ లకు జనాదరణ తక్కువవటం చేత కార్లు కావాలంటే చాలా ముందుగా షోరూంలో Book చేసుకోవాల్సివచ్చేది. కానీ ఇప్పుడు ఆ అవస్థలు లేకుండా Hyundai i10 - Automatic లో కావాల్సిన రంగు,కావాల్సిన వెర్షన్ ( Magna, Sportz , Asta) రెడీ స్టాక్ లో లభిస్తున్నాయి. ఎక్కువ మొత్తంలో ఈ i10 కార్లు అమ్ముడుపోవటం చేత వీటికి Service Support, Spare parts లభ్యత సులువని భావిస్తాను.
ఇక ఈ Automatic బళ్ళు నడపటమెలాగో తెల్సుకుందాం.
Manual Transmission కార్లకి Automatic Transmission కార్లకి మధ్య కనపడే స్పష్టమైన తేడాలు రెండు. మొదటిది గేర్ పానెల్, రెండవది - క్లచ్ పెడల్ లేకపోవడం. పక్కనున్న బొమ్మలో చూపించినది Hyundai i10 గేర్ పానెల్. గేర్ రాడ్ కి ఉన్న chrome బటన్ -A క్లచ్ అన్నమాట. గేర్ రాడ్ ని ఒక గేర్ నుంచి ఇంకో గేర్ లోకి మార్చేటప్పుడు ఈ క్లచ్ బటన్ ని గట్టిగా ప్రెస్ చేసి పట్టుకొని మార్చుకోవాలి. హేండ్ బ్రేక్ వాడటంలో Automatic కి Manual కి ఏమాత్రం తేడా లేదు.
గేర్ పానెల్ మీద ఉన్న symbols చూద్దాం .
P అంటే - పార్కింగ్ మోడ్. R అంటె - రివర్స్ గేర్, N- For న్యూట్రల్ గేర్, D అంటే డ్రైవింగ్ మోడ్. "2" అంటే 2 nd గేర్, "L" అంటే లోడ్ గేర్. కారుని కేవలం P ( Parking ) గేర్లో కానీ Neutral గేర్లో కానీ ఉన్నప్పుడు మాత్రమే కీ తిప్పుకొని బండి ని Start చేసుకోవాల్సి వుంటుంది. బండిని Start చేసేటప్పుడు బ్రేక్ పెడల్ తొక్కి పెట్టడం ఉత్తమం. Start చేసాక, హేండ్ బ్రేక్ Dis-Engage చేసుకొని , క్లచ్ బటన్ నొక్కి పట్టుకొని డ్రైవింగ్ గేర్ (D) లోకి మార్చుకోవాలి. నెమ్మదిగా బ్రేక్ మీంచి కాలు తీస్తే సరి బండి ముందుకు కదులుతుంది.
Automatic బళ్ళ విషయంలో జాగ్రత్తగా వుండవలిసినది Traffic సిగ్నళ్ళ వద్ద లేదా మరెక్కడైనా బండిని ఆపాల్సి వచ్చినప్పుడు - హేండ్ బ్రేక్ engage చేయటం, బ్రేక్ పెడల్ తొక్కిపెట్టడం లేదా Neutral gear లేదా (P) పార్కింగ్ గేర్ లోకి మార్చుకోవటం తప్పనిసరి. లేక పోతే మీ బండి ఎవరినైనా గుద్దుకోవటం ఖాయం.
(P) పార్కింగ్ గేర్ :Automatic బళ్ళని పార్కింగ్ లో ఉంచేటప్పుడు ( P) Parking గేర్ లో నే ఉంచటం తప్పనిసరి.
బండి ని Start చేసెటప్పుడు కూడా పార్కింగ్ గేర్ లోనే వుంచుకోవాలి.
(R) Reverse గేర్ : Reverse చేసుకోవటానికి.
(N) Neutral గేర్ : Neutral Position.
(D) Driving గేర్ : For driving the vehicle. ఈ గేర్ లో ఉన్నప్పుడు Accelerator ని, బ్రేక్ పెడళ్ళను తొక్కడాన్ని బట్టి బండి ఆటోమాటిక్ గా ఒకటవ గేర్ నుంచి నాల్గవ గేర్ మధ్యలో దానంతట అదే మారుతూ ఉంటుంది. Car Start చేసి ఈ గేర్లోకి మార్చుకోగానే బండి ముందుకు కదలటం మొదలవుతుంది, కనుక జాగ్రత్త.
(2) 2 nd గేర్ :ఈ గేర్ లో బండి కేవలం 2nd గేర్ కి మాత్రమే పరిమితమవుతుంది కనుక ఈ గేర్ ని హైవే లపై Takeover చేయటానికి ఉపయోగిస్తారు.
(L) Load గేర్ : ఈ గేర్ లో బండి కేవలం 1 st గేర్ కి మాత్రమే పరిమితమవుతుంది కనుక ఈ గేర్ ని ఎత్తులు, కొండలు, ఘాట్ రోడ్లు ఎక్కేటప్పుడు ఉపయోగిస్తారు.
(B) Over-Drive cancelling Button : ఈ బటన్ నొక్కితే బండి Over-drive cancel అవుతుంది, బండి కేవలం ఒకటి నుంచి మూడవ గేర్ల కి మాత్రమే పరిమితమవుతుంది. కనుక దీనిని ఎత్తులు, కొండలు, ఘాట్ రోడ్లు దిగేటప్పుడు ఉపయోగిస్తారు.
ఒక సారి start చేసి Driving గేర్లోకి మారిస్తే ఇక ఆపేవరకూ కెవలం బ్రేక్, Accelerator ల తొ నే పని.
క్లచ్ ఉండదు, సిటీ ట్రాఫిక్ లో ఈ బండి నడపటం చాలా సులువు. మాటి మాటికీ గేర్లు మార్చటం, క్లచ్ తొక్కే అవసరం ఉండదు. ఎడమ కాలుకి, ఎడమ చేతికి దాదాపుగా పూర్తి విశ్రాంతి అని చెప్పవచ్చు.
Automatic బళ్ళతొ సౌకర్యాలు ఎలా వున్నా, వీటి Mileage (Fule efficiency )వీటి ప్రధాన బలహీనత. Manual కార్లతో పొల్చితే వీటి Mileage దాదాపుగా 20 శాతం తక్కువ. నా i10 కేవలం లీటరుకి 10 కి.మీ Mileage మాత్రమే ఇస్తుంది. Mileage కన్నా Mental peace / driving ease ముఖ్యం అనుకొనేవారికి Hyundai i10 - Auto ఒక మంచి option.
DISCLAIMER :
All data and information provided on this site is for informational purposes only. http://krishnarjunsblog.blogspot.com/ makes no representations as to accuracy, completeness, currentness, suitability, or validity of any information on this site and will not be liable for any errors, omissions, or delays in this information or any losses, injuries, or damages arising from its display or use. All information is provided on an as-is basis.
No comments:
Post a Comment