DISCLAIMER

All data and information provided on this site is for informational purposes only. http://krishnarjunsblog.blogspot.com makes no representations as to accuracy, completeness, currentness, suitability, or validity of any information on this site and will not be liable for any errors, omissions, or delays in this information or any losses, injuries, or damages arising from its display or use. All information is provided on an as-is basis.

Wednesday, June 30, 2010

పాకిస్తాన్ గజ్జెలగుఱ్ఱాలు


పాకిస్తాన్ లో ప్రైవేట్ బస్సులను ఇలా గజ్జెలగుఱ్ఱాల్లా అలంకరిస్తారు. ఎంత ఎక్కువగా అలంకరిస్తే అంత గొప్ప అన్నమాట అక్కడ. ఇండియా లో కంటే చాలా ముందుగానే పాకిస్తాన్ లో కి వోల్వో, దేవూ బస్సులు ప్రవేశించాయి. అయినా అక్కడ ఇలాంటి గజ్జెలగుఱ్ఱాలకి ఆదరణ ఏ మాత్రం తగ్గలేదు. అక్కడ CNG లభ్యత చాలా ఎక్కువ, కనుక ఇప్పుడు అక్కడ చాలావరకు CNG బస్సులు కనిపిస్తున్నాయి.

Tuesday, June 29, 2010

Encumberance Search

Encumberance Certificate కోసం రిజిస్ట్రేషన్ ఆఫీస్ చుట్టూ తిరగనక్కరలేదిక.

మీరింక ఇంటివద్దనుంచే సెర్చ్ చెసుకోవచ్చు.
కింది లింక్ క్లిక్ చేయండి.

http://igrs.ap.gov.in/pls/anybody/ec?ag_name=PUBLIC

Sunday, June 27, 2010

జపనీస్ వెండింగ్ మెషీన్లు




జపాన్ ను ప్రపంచంలో అత్యధికంగా వెండింగ్ మెషీన్లను వాడే దేశంగా చెప్పుకోవచ్చు. అక్కడ ప్రతీ 23 మందికి ఒక వెండింగ్ మెషీన్ ఉన్నట్టు ఒక అంచనా. ఈ మెషీన్లను సాఫ్ట్ డ్రింక్స్, గ్రీన్ టీ, ఐస్ క్రీం, న్యూస్ పేపర్స్, మేగజైన్స్,సిగరెట్స్,బీర్లు మొదలైనవాటిని అమ్మటానికి వాడుతారక్కడ. ఫుట్ పాత్ ల పై ఎక్కడ పడితే అక్కడ ఇవి వరుసగా కనిపిస్తాయక్కడ. అక్కడ దొంగలు వీటి జోలికి రారు అందుకే అక్కడ అవంతగా సక్సెస్ఫుల్ అయ్యాయి. కాయిన్లే కాదు నోట్లను కూడా ఇవి స్వీకరించి కరెక్ట్ చిల్లర తిరిగి ఇస్తాయి. హోటళ్ళ లొ ప్రతీ ఫ్లోర్లో వీటిని ఏర్పాటు చేస్తారు అక్కడ. రూం సర్వీస్ వాళ్ళని డిస్టర్బ్ చేయక్కర లేదు. మనంతట మనం కావల్సినప్పుడల్లా కావల్సిన డ్రింక్ ఈ మషీన్ల నుంచి తీసుకోవచ్చు. పక్కనున్న ఫోటో మీరు గమనిస్తే, 500 మి.లీ సాఫ్ట్ డ్రింక్ బాటిల్ ఖరీదు 120 యెన్లు. అంటే ఇండియన్ కరెన్సీ లో 60 రూ.లూ. దాదాపుగా మన రేట్ల కంటే రెండు రెట్లు.

Saturday, June 26, 2010

జపనీస్ కాప్స్యూల్ హొటళ్ళు

జపనీస్ హొటళ్ళు:
జపాన్ లో భూమి చాలా ఖరీదు, టొక్యో లాంటి సిటీ లో ఐతే అడుగు స్థలం దొరకడమే మహ గగనం. హొటల్ చార్జీలు గూబ గుయ్యిమనిపిస్తాయి. పైగా హొటల్ రూములు చాలా చిన్నవిగా ఉంటాయి. కాని ఆ చిన్న ప్రదేశం లోనే అన్ని సౌకర్యాలను పొందుపరుస్తారు. మేము దిగింది హొటల్ కందా స్టేషన్ హొటల్.రూం చిన్నదే.టాయిలెట్ ఐతే మరీ 3" x 5" సైజు లో ఉంది. అందులోనే బాత్ టబ్ కూడా ఏర్పాటు చేసారు. సబ్బు బిళ్ళల బదులుగ లిక్విడ్ సొపు ఉంచారు. సబ్బు బిళ్ళలు వేస్టు గాకుండా మంచి పద్దతి. లాండ్రీ లేదు ఆ హోటల్లో, ఒక చోట ఒక చిన్న వాషింగ్ మెషీను ఏర్పాటు చేసారు. మనమే ఉతుక్కోవాలన్నమాట !!. రూం రెంట్ రోజు కి 5000 రూ.లు. టీవీ లో కొన్ని ఫ్రీ చానెల్స్ మాత్రమే వస్తాయి. పెయిడ్/ పోర్న్ చానెల్స్ చూస్తే హొటల్ బిల్లు మోతమోగుద్ది. హొటల్నుంచి ఫొను మాట్లాడినా అంతే సంగతులు.




జపనీస్ కాప్స్యూల్ హొటళ్ళు :

పక్క ఫొటోల్లొని పెట్టెలను చూసారుగా. ఇవీ కాప్స్యూల్ హొటళ్ళంటే. రోజుకి 1500 రూ.ల అద్దె తో లభిస్తాయివి. చిన్న చిన్న వ్యాపారస్తులకీ, టూరిస్టులకీ, దగ్గరలో పనిచేసే ఉద్యోగస్తులకీ ఇవి వాళ్ళ బడ్జెట్లో దొరుకుతాయి.ఇక్కడ ఉద్యోగస్తులు ఆఫీసుల్లో ఎక్కువ సమయం గడుపుతారు,ఆఫీసు సమయం దాటినా సీట్లకే అతుక్కొని వుంటారు. చీకటి పడ్డాక తమ సహోద్యోగులతో లేదా ఉన్నతోద్యోగులతో బార్లు,రెస్టారెంట్లలో గడుపుతారు. అర్ధరాట్రి దాటితే లొకల్ ట్రైన్లు దొరకవు, దూరంగా ఉండే తమ గ్రుహాలకు వెళ్ళలేక రాత్రుళ్ళు ఈ కాప్స్యూల్ హొటళ్ళలో గడుపుతారు. 2 మీ x 1 మీ x 1మీ సైజు ఉండే ఈ కాప్స్యూల్ పెట్టెల్లో టీవీ, రేడియో, అలారం తదితరాలు ఉంటాయి. స్నానాల గదులు మాత్రం కామన్ గా ఉంటాయి.

Friday, June 25, 2010

हम को मन की शक्ति देना

हम को मन की शक्ति देना, मन विजय करेदूसरों की जय से पहले ख़ुद को जय करेहम को...भेद भाव अपने दिल से साफ़ कर सकेदोस्तों से भूल हो तो माफ़ कर सकेझूठ से बचे रहे, सच का दम भरेदूसरों की जय से पहले ख़ुद को जय करेहम को मन की शक्ति देना, मन विजय करेदूसरों की जय से पहले ख़ुद को जय करेमुश्किलें पड़ें तो हम पे इतना कर्म करसाथ दें तो धर्म का, चलेंगे धर्म परख़ुद पे हौसला रहे, बदी से न डरेदूसरों की जय से पहले, ख़ुद को जय करेहम को मन की शक्ति देना, मन विजय करेदूसरों की जय से पहले ख़ुद को जय करे
Translation in English :

Please grant us the power over our minds so that the mind may score a victory over itself before it can score victory over others.

We pray to eschew all ill feelings from our hearts.

Give us the power to forgive our friends when they err.

Save us from lies, and stick to the truthIf we face any hazards,

God do this favour, Let us support 'Dharma' and let us walk on the path of 'Dharma'

Let us retain faith in ourselves and not succumb to evil.

SOURCE : YOUTUBE

తూ ప్యార్ క సాగర్ హై

"Seema" హిందీ సినిమాలో ని ఈ పాటంటే నాకు ప్రాణం.

"దో ఆంఖే బారా హాత్"

జపనీస్ పంక్ట్చువాలిటీ

జపనీయుల పంక్చువాలిటీ చూస్తే దిమ్మ తిరిగి మైండు బ్లాక్ అయ్యింది. వాళ్ళ బుల్లెట్ ట్రైన్ ల నుంచి అన్నీ పంక్చువల్ గా నడుస్తాయి. మనుషులైతే మరీనూ. మేము అక్కడున్న మూడు రోజులు ఉదయం 8 గంటలకి మమ్మల్ని పికప్ చేసుకోవడానికి మా జపాన్ ఏజెంట్ వాళ్ళ ఆఫీసు మనిషి వచ్చేవాడు. ఏ రోజు అతను ఒక్క నిమిషం కూడా లేటు గా రాలేదు. అతనుండేది మా హోటల్ నుంచి గంట ప్రయాణం. పైగా మమ్మల్ని రాత్రి హోటల్ దగ్గిర దించేసరికి రాత్రి 11 గంటలు అయ్యేది. అయినా అతనేనాడూ లేటుగా వచ్చేవాడు కాదు.
మేము టోక్యో లో ఒక ట్రేడ్ ఫెయిర్ లో ఎగ్సిబిట్ చేయడానికి వెళ్ళాము. అక్కడ స్టాల్లో ఉండగా చూసాము,మాకు అప్పాయింట్మెంట్ ఇచ్చిన వ్యక్తి అప్పాయింట్మెంట్ టైముకన్నా 5 నిమిషాలు ముందుగా మా స్టాలు వద్దకు వచ్చినప్పటికీ, మేము స్టాల్లొ ఖాలీగా గోళ్ళు గిల్లుకుంటూ కూర్చున్నప్పటికీ అతను స్టాల్ల్ లోనికి రాలేదు. ఖరక్టుగా అప్పాయింట్మెంట్ టైముకి అతను స్టాల్లోకి వచ్చి కూర్చొన్నాడు. అదీ వాళ్ళ టైం పంక్చువాలిటీ.

జపనీస్ బుల్లెట్ ట్రైన్

SHINKANSEN - Japanese bullet train that connects Tokyo and Osaka cities, a distance of 515 km is covered in 2 hr 30 min.

ముంబయి లోకల్ ట్రైన్

ఈ వీడియో చూస్తే మాత్రం ముంబయి లోకల్ ట్రైన్ కంటే జపాన్ లోకల్ ట్రైన్ వెయ్యి రెట్లు బెటర్ అనిపిస్తుంది.

జపాన్ లోకల్ ట్రైన్ రద్దీ

జపాన్ లోకల్ ట్రైన్ రద్దీ చూస్తే ముంబయి లోకల్ ట్రైన్ బెటర్ అనిపిస్తుంది.

నా జపాన్ టూర్ విశేషాలు - Part 1

జీతాలు మరీ పెద్దగా లేకపోయినా,నేను పని చేసే ఫార్మా కంపెనీ లో విదేశీ ప్రయాణ అవకాశాలు బాగానే ఉంటాయి. ఉద్యోగ రీత్యా నేను చాలానే దేశాలను చుట్టిరావడం జరిగింది. అవి 1) బంగ్లాదేశ్ 2) పాకిస్తాన్ 3) స్పెయిన్ 4)ఫ్రాన్స్ 5) జపాన్

బంగ్లాదేశ్, పాకిస్తాన్ల కు మన దేశానికి పెద్దగా తేడాలు కనిపించవు మరియు భాషాపరమైన ఇబ్బందులేమీ పెద్దగా ఉండవు. కానీ ఫ్రాన్స్,స్పెయిన్,జపాన్లలో మాత్రం భాష ఆర్థం గాక చాలా కష్టపడాల్సి వచ్చింది. భాషే కాదు భోజన విషయంలో కూడా అంతే కష్టపడాల్సి వచ్చింది.వెజిటేరియన్ల కైతే మరీ కష్టం.ఈ దేశాల్లో భోజనం దగ్గర వాళ్ళ కష్టాలు పగవాడికి కూడా వద్దనిపిస్తాయి.

ఇక జపాన్ విశేషాలకి వస్తే, రేపు ముంబాయి లో ఫ్లైటు అనగా ఇవ్వాళ సాయంత్రం మాకు జపాన్ వీసా దొరికింది. కానీ మా పాసుపోర్ట్లు చెన్నై ఎంబసీ లో...??!!! కష్టం మీద ఒక స్నేహితుడు సహాయపడి మా పాసుపోర్ట్లు రాత్రికి రాత్రి హైదరాబాద్ కి ఫ్లైట్ లో తీసుకురావడంతో ఈ ప్రయాణం సాధ్యపడింది. లాస్ట్ మినిట్లో ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకోవడం, ఇన్సూరెన్స్, డాలర్లు కొనుక్కోవటం, ఆదరాబాదరాగా బట్టలు సర్దుకోవటం నా జీవితంలో మర్చిపోలేను.

తర్వాత రోజు మధ్యాహ్నం 12 గంటల కల్లా మేము ముంబాయి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు లో ఉన్నాము. అక్కణ్ణుంచి థాయ్ ఎయిర్ లైన్స్ ఫ్లైట్లో బ్యాంకాక్ కి, బ్యాంకాక్ లో 3 గంటల వెయిటింగ్ తర్వాత అక్కణ్ణుంచి థాయ్ ఎయిర్ లైన్స్ ఫ్లైట్లో ఓసాకా, కన్సాయి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు, జపాన్ చేరుకున్నాం. కన్సాయి ఎయిర్‌పోర్టు ఒక ద్వీపంగా చెప్పుకోవచ్చు.ఒసాకా నుంచి దాదాపు 50 కి.మీ దూరంలో దీన్ని నిర్మించారు.దీనిని లాండ్ రిక్లయిం చేసి కట్టారు.

ఎయిర్‌పోర్టు నుంచి కాలు బయట పెట్టగానే నా కంటబడింది ఏమిటంటే పబ్లిక్ స్మోకింగ్ ఏర్పాట్లు. ఒక చోట తెల్ల రంగులో గడి గీసిన చొట యాష్ ట్రే స్తాండులు ఉన్నాయి. స్మోకింగ్ చేసేవారంతా ఆ గడిలోనే నిలబడి స్మోక్ చేయాలి. బజార్లలో కూడా కొన్ని చోట్ల చిన్న చిన్న సందుల్లో స్మోకర్లకి ప్రత్యేక ప్రదేశాలున్నాయి. ట్రైన్లలో కూడా కొన్ని పెట్టెల్లొ స్మొకింగ్ పర్మిటెడ్,. డిస్ప్లే సిస్టంలో ఏపెట్టెలో స్మోకింగ్ పెర్మిటెడొ డిస్ప్లే అవుతూంటూ ఉంటుంది. జపాన్ వాతావరణం చల్లగా ఉంది ( ఏప్రిల్ నెలలో). దాదాపుగా ప్రతి ఒక్కరూ సూట్లను ధరిస్తారు. మరీ చల్లని ప్రదేశాలలో ట్రైన్లలో హాట్ ఏర్ సర్కులేషన్ ఉంటుంది.

జపాన్ వాసులు చాలా మర్యాదస్తులనే చెప్పుకోవాలి. వగి వంగి దణ్ణాల్లు పెడతారు.అది వాళ్ళ గ్రీటింగ్ పద్దతి.
ఆడవాళ్ళు మరీ ఎక్కువగా కనిపించరు. ఉద్యోగాలు చేసే ఆడవారి శాతం తక్కువే. అక్కడ టాక్సీలు చాలా ఖరీదు. ఆ మాటకొస్తె జపాన్లో అన్నీ ఖరీదనే చెప్పాలి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టం చాలా బాగుంది.ఎయిర్‌పోర్టు ఆవరణలోనే మెట్రో ట్రైన్ స్తేషన్లతో ఎంతొ సౌకర్యంగా అనిపించాయి.
కన్సాయి ఎయిర్‌పోర్టునుంచి షిన్ ఒసాకా స్టేషన్ కి గంట ప్రయాణం. ట్రైన్ స్టేషన్ కి బయట ఉన్న ఎలక్ట్రానిక్ కియోస్కులలో ఇండియన్ క్రెడిట్ కార్డులతొ సులువుగా టికెట్లు తీసుకోగలిగాం. గంట ప్రయాణానికి దాదాపుగా 1400 రూపాయలు ( 2800 యెన్లు ) మనిషికి ఖర్చు.
ట్రైన్లలో రిజర్వుడు, అన్రిజర్వుదు టికెట్లు దొరుకుతాయి. ఫేర్లలో కొద్దిగా తేడా ఉంటాయి వీటికి. ట్రైన్ సర్వీసులన్నీ ప్రయివేటైజ్డ్. ఇదే దూరానికి ఒకవేళ మేము టాక్సీ చేసుకొనిఉంటే దాదాపుగా ఏడువేలు క్షవరం అయివుండేవి. టాక్సీ ఎక్కి దిగితే, అంటె 2 కి.మీ మినిమం దూరానికి 350 రూ.లు ఫిక్స్డ్ చార్జ్. ఆపై కి.మీ ఒక్కింటికి 100 రూ.లు అదనం.

ట్రైన్లలో టికెట్ ఎక్జామినర్ బోగీ లో కి వచ్చేటప్పుడు, బోగీ లోంచి వెళ్ళిపోయేటప్పుడు వంగి బొఓగీ లోని అందరికి అభివాదం చేయటం,ప్రతీ పాసింజర్ ని మర్యాద పూర్వకంగా గ్రీట్ చేసి టికెట్ అడగడం నన్ను బాగా అలరించిన విషయం. రద్దీ సమయాల్లో జపాన్ ట్రైన్లకు ముంబయి లోకల్ రైళ్ళకు పెద్దగా తేడా వుండదు. జనాలు ఒక పద్దతిగా ప్లాట్ఫారం మీద క్యూ లో నిలబడటం తప్ప.

షిన్ ఒసాకా లో దిగి మా క్లయింటు నొకరిని కలిసి తిరిగి రైల్ స్టేషన్ కి వచ్చాము. మా జపాన్ ఏజెంట్ అక్కడ మమ్మల్నక్కడ ఒక రెస్టారెంట్ కి తీసుకెళ్ళాదు. రెస్టారెంట్ లో కి అడుగుపెట్టగానే వాళ్ళు మమ్మల్ని అడిగిన మొదటి విషయం స్మోకింగా, నాన్ స్మోకింగా అని. ఇంకో జపాన్ ప్రత్యేకత ఏమిటంటే రెస్టారెంట్ లో, టాక్సీల్లొ కస్టమర్లు రాగానే వారికి వెట్ / హాట్ టవల్ ఆఫర్ చెయ్యటం. మన దగ్గర కొన్ని ఎయిర్‌లైన్సు వాళ్ళు ఆఫర్ చేయటం మీరు చూసేవుంటారు. అది అక్కడ ఒక పెద్ద బిజినెస్.
రెస్టారెంట్ లో చాప్ స్టిక్కులతో మా విన్యాసాలు, అవస్థలు చూడలేక మా ఏజెంట్ మాకోసం ఫోర్క్, స్పూను తెప్పించి ఇచ్చాడు.జపనీస్ నూడుల్స్ ఆ ఫోర్క్, స్పూన్లకు ఏమాత్రం లొంగలేదు. నానా అవస్థలూపడి ఏదోలా భోజనం అయ్యింది అనిపించాము. తరువాత మా ఏజెంట్ కి టాటా బై బై చెప్పి టోక్యో కి బుల్లెట్ ట్రైన్లో బయల్దేరాము. ఒసాక నుంచి టోక్యో దాదాపు 515 కి.మీ. ఒసాక - టోక్యో బుల్లెట్ ట్రైన్ సర్వీసుని "షిన్ కాన్సెన్" అని అంటారు. 515 కి.మీ దూరాన్ని ఇవి రెండున్నర గంటల్లో పూర్తిచేస్తాయి. ఒసాక నుంచి టోక్యో కి ఈ బుల్లెట్ ట్రైన్ ఫేర్ దాదాపుగా 7500 రూ.లు. ఎయిర్ ఫేర్ తొ సమానం. కానీ చాలామటుకు అందరూ ట్రైనే ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటె ఎయిర్ పోర్ట్లు సిటీ కి దూరంగా ఉండటం, చెకింగ్, బోర్దింగులకు చాలా సమయం పట్టడం మొదలైన కారణాల వల్ల. ట్రైన్లలో సీట్లకు ట్రే టేబుళ్ళు ఉండటమేకాదు, కావాలంటే సీట్లను వెనక్కు జరుపుకోవచ్చు, వెనక్కు తిప్పుకోవచ్చుకూడా. ట్రైన్లు అన్నీ వైఫయి ఎనేబుల్డ్.ట్రే టేబుళ్ళ మీద లాప్ టాప్ పెట్టుకొని పనిచేసుకోవదానికి వీలుగా ఉంటాయి. కొన్ని డబుల్ డెక్ భోగీలలో చిన్న లిఫ్ట్ కూడా వుందటం చూసాను. లగేజీ ని పైకి మోసుకెళ్ళనక్కర్లేకుండా ఈ లిఫ్ట్ లను వాడుకోవచ్చు.రైల్వే స్టేషన్లలో మన స్వీట్ బాక్స్ లాగ ఉండే లంచ్ బాక్స్ లు అమ్ముతారు, వివిధ రకాలైన కాంబినేషన్లలో ఇవి దొరుకుతాయి. ఖరీదు దాదాపు 350 రూ.లు. మరో జపాన్ ప్రత్యేకత ఏమిటంటే గ్రీన్ టీ.
500 మి.లీ బాటిల్ గ్రీన్ ట్రీ 60 రూ.లు ఉంటుంది. అందరూ మంచి నీళ్ళకు బదులు గ్రీన్ టీ తాగుతారు. గ్రీన్ టీ ఆరోగ్యానికి మంచిదని వారి నమ్మకం. ఈ గ్రీన్ టీ చాల రకాల ఫ్లేవర్లలో దొరుకుతుంది. జనాలు ఒక లంచ్ బాక్స్, గ్రీన్ టీ బాటిల్ కొనుక్కొని ట్రైన్ ఎక్కి, ట్రే టెబుల్ మీద పెట్టుకొని తినేసి,ఖాళీ డబ్బాలను, ఖాళీ బాటిళ్ళను ప్లాస్టిక్ కవర్లలో బిగించి స్టేషన్లో దిగాక అక్కడ వుండే ట్రాష్ బిన్ లలో వేసేస్తారు.ఈ ట్రాష్ బిన్లలో వేసేటప్పుదు మనం చెత్తని సెపరేటు చేసి వేయాల్సివుంటుంది. రీసైక్లింగ్ కి సెగ్రగేషన్ కీ సులువుగా ఉండడానికి ఆ ఏర్పాటు.

Tuesday, June 22, 2010

పాకిస్తాన్ ఇండియా కి చేసిన మేలు

మాటల మద్యలో మా మిత్రుడన్న ఈ మాటలు నాకు బాగా నవ్వు తెప్పించాయి. అవి మీ కోసం..

పాకిస్తాన్ సానియా మీర్జా ని తీసుకెళ్ళింది
ఖతార్ యం.ఎఫ్.హుస్సేన్ ను తీసుకెళ్ళింది
రాఖీ సావంత్ ని కూడా ఎవరన్నా తీసుకెళ్ళండి రా బాబూ...

Sunday, June 20, 2010

అరిషడ్వర్గములు - త్యాగయ్య సినిమా నుంచి

కామ,క్రోధ,లోభ,మోహ,మద,మాత్సర్యాదులు చుట్టుముట్టినప్పుడు భాగవతోత్తములైన ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక,వ్యాస,అంబరీష,శుక,శౌనక, భీష్మ,రుక్మాంగద,అర్జున,వశిష్ట,విభీషణాదులను తలచుకొన్నంత అవి పటాపంచలవును.

నాకు బాగా నచ్చిన "ఆ నలుగురు" సినిమా నుంచి ఒక సీన్.

http://www.youtube.com/watch?v=4R_lQN8Vz7U

సినీ నటుడు "కోటా శ్రీనివాస రావ్" కుమారుడు "కోటా ప్రసాద్" దుర్మరణం

ఫాథర్స్ డే నాడు కోటా ప్రసాద్ దుర్మరణం తీవ్రం గా కలిచివేసింది. ఎంతో ముచ్చటపడి ఆ స్పోర్ట్స్ బైక్ని ఈ ఏప్రిల్ లో నే కొన్నాడట. అది ఒక 1000 సి.సి హొండా ఇటలి మేక్ స్పోర్ట్స్ బైక్.కుటుంబ సభ్యుల తో భోజనం చేసి వస్తూండగా జరిగిన రోడ్డు ప్రమాదం.కుటుంబ సభ్యులంతా కార్లో వస్తూంటే ప్రసాద్ మాత్రం తన స్పోర్ట్స్ బైక్ మీద ప్రయాణించతం, ఈ ప్రమాదం చోటు చేసుకొవడం విధి బలీయత కు తార్కాణం. భగవంతుడు అతని ఆత్మకు శాంతిని, ఆ కుటుంబ సభ్యులకు మనోదైర్యం ప్రసాదించుగాక.

Saturday, June 19, 2010

Happy fathers day

బాహ్యంగా గంభీరం గా అనిపించినా అంతర్గతంగా నీ మనసే వెన్న. "నాన్నా పులి" కథలో నాన్నవు కాదు నువ్వు, ఎన్ని తప్పులు చేసినా క్షమించే అనురాగమూర్తివి నువ్వు. అది గ్రహించేసరికి నేను పెద్దవాడినైపొయాను. Better late than never, I love you dad. Happy fathers day.

Friday, June 18, 2010

తెలుగులో టైపు చేయడానికి software

ఏదో కొన్ని బ్లాగులను చూసి ప్రభావితుడినై నేను నా బ్లాగు ప్రారంభించాను గాని ఆ తరువాత అర్థమయింది ఏమిటంటే అది అంత సులువైన విషయం కాదు అని. రాయడానికి రోజూ ఏదో ఒక విశేషాలు ఉన్నా రాయడానికి సమయం కేటాయించటం, ఓపికగా వ్రాయటం అంత సులువైనవి కావు,ముఖ్యంగా తెలుగు లో వ్రాయటం. మొదట్లో చాలా సమయం దీనికే పడుతుంది కాని నెమ్మదిగా, అలవాటు అయ్యక ఇప్పుడు సులువుగా వ్రాయగలుగుతున్నాను.
తెలుగులో టైపు చేయడానికి www.sirigina.com/telugulipi.aspx
లేదా http://www.lekhini.org/ కాని http://www.baraha.com/ విజిట్ చేయండి. http://www.sirigina.com/ నుంచి Telugu Lipi software, Fonts download చేసుకోవచ్చు.

Monday, June 14, 2010

LRS scheme extended

Layout Regularisation scheme గడువు 31-12-2010 వరకు పొడిగించబడింది.

ఇంతకుముందు అప్లై చేయని వారికి ఇది మరొక అవకాశం.

బాపు - పెళ్ళిపుస్తకం సినిమా కొటేషన్లు

నాకు బాగా నచ్చిన సినిమాలలో బాపు - పెళ్ళిపుస్తకం ఒకటి.అందులోని కొన్ని డైలాగులు / బాపు కొటేషన్లు నాకు బాగా నచ్చాయి. నేను చాలా సంధర్భాలలో వాటిని కోట్ చేస్తూఉంటాను కూడా. అవి...
1) అసూయ ఘాటైన ప్రేమకి థెర్మామీటర్ వంటిది.

2) మంచి చెడ్డలు రాశులు పోసినట్లు వేరు వేరు గా ఉండవు. అవసరాన్నిబట్టి మంచితనం అవకాశాన్నిబట్టి చెడ్డతనం పెరుగుతాయి.

3) నమ్మకం లేని చోట నారాయణా అన్నా బూతు మాటలాగా వినిపిస్తుంది అదే నమ్మకమున్నచోట బూతు కూడ నారాయణా అన్నట్టు ఉంటుంది.

4) అవకాశాన్నిబట్టి మంచివాళ్ళు చెడ్డవాళ్ళవచ్చు, అవకాశం లేకపోతే చెడ్డవాళ్ళుకూడా మంచివాళ్ళుగా మిగిలిపోవచ్చు. వౄద్ధ నారీ పతివ్రతహా

5) తగాదాలు లేని జీవితం పోపు లేని సాంబారు లాగా ఉంటుంది.

Sunday, June 13, 2010

People are corrupt ( ప్రజలే అవినీతిపరులు )

ప్రజలే అవినీతిపరులు
నేను రెగ్యులర్ గా ఫాలో అయ్యే బ్లాగుల్లో "ఆంధ్రప్రదేశ్ మీడియా కబుర్లు" ఒకటి. ఈమద్య అందులో, రాము గారు TV1 లోని ఒక ప్రోగ్రాము గురించి, మీడియాలో ని పోకడల గురించి వ్రాసారు. ఆ పోస్టింగులు, ఆ కామెంట్లు, అనామికల గాళ్ళ కామెంట్లు చదివాక నాకో ప్రోగ్రాము చెయ్యాలనిపిస్తుంది. దాని టైటిల్ "People are corrupt". మనం ఇంట్లో కూర్చుని అనుకుంటూ ఉంటాము, ఈ పొలిటీషియన్లు, బిజినెస్ మాన్లు, అధికారులు అంతా అవినీతిమయం అని, కాని నిజానికి మనమంతా, మనలోని ప్రతి ఒక్కరు ఏదో ఒక రకంగా అవినీతిపరులమే. వీటన్నిటిని ( మనలోని కుళ్ళు, అవినీతులను ) బహిరంగపరుస్తూ, ముందుగా మనం మారలని తెలియచేస్తూ ఆ ప్రోగ్రాము ఉండాలన్నది నా ఆలోచన.

ఈ సంధర్భంలో నాకు బాపు - పెళ్ళిపుస్తకం సినిమాలోని డైలాగు గుర్తుకొస్తూంది.
"మంచి చెడు అనేవి రాశుల్లా పోసి ఉండవు.. మంచి వాడు అవసరం కొద్దీ /అవకాశం వస్తే చెడ్డ వాడిగా మారచ్చు.. చెడ్డ వాడు అవకాశం లేక/ రాక మంచి వాడు గా మిగిలిపోవచ్చు". ( వ్రుద్ధ నారీ పతివ్రతహా )

తెలుగు నటి డింపుల్ అరెస్టు

విషాదం ఏమిటంటే, ఈ కాలం యువతి అయిఉండి కూడా, పెళ్ళి కోసం ఇంతగా తాపత్రయపడటం, పెళ్ళేపరమావధి అన్నట్టుగా, శ్రీధర్ తప్పితే ఇంకెవరూ దొరకరన్నరీతిలో నేరానికి తెగించడం, ఒక తప్పు కప్పిపుచ్చడానికి ఇంకో తప్పు చేయడం.
Moral of the story : Crime never pays.

http://ibnlive.in.com/news/andhra-tv-actress-held-for-attack-on-fianc/124112-8-69.html?from=tn

Saturday, June 12, 2010

నాకు నచ్చిన, నేను అనుసరించే ఒక చందమామ కథ.

ఒకానొక గ్రామంలో రామయ్య అనే గ్రామపెద్ద ఉండేవాడు, అతనికి ఆ గ్రామంలోనే కాకుండా ఆ చుట్టుపక్కల గ్రామాలలొ కూడ మంచి పేరు ఉండేది. అందరూ తమ సమస్యలను అతనికి చెప్పి ఆయన సలహలు తీసుకునేవారు. కొన్నాళ్ళకు రామయ్య మరణించాడు.అతని కొడుకులైన శీనయ్య, సీతయ్యలు గ్రామపెద్దలు గా వ్యవహరించేవారు.గ్రామ ప్రజలు వారి వద్దకు తమ తమ సమస్యలతో రాసాగారు. కొన్నాళ్ళకు శీనయ్య వద్దకు వచ్చే వారు క్రమంగా తగ్గిపోసాగారు.మరోపక్క సీతయ్య వద్దకు వచ్చే వారి సంఖ్య పెరగసాగింది.చుట్టుపక్కల గ్రామాలలో సీతయ్యకి మంచి పేరు రాసాగింది.
తన దగ్గరకు వచ్చేవారు తగ్గటం చూసి, శీనయ్య తన సొదరుడైన సీతయ్య వద్దకు వెళ్ళి ఈ విషయం చెప్పి తన వద్దకు జనం ఎందుకు రావటం లేదు కారణం ఏమై ఉంటుందని అడిగాడు.
దానికి సీతయ్య నవ్వి, సోదరా,సలహల కోసం మనవద్దకు వచ్చేవారిలో చాలామటుకు మంది ముందుగానే ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకొనే వస్తారు. అందుకే నెను నా వద్దకు వచ్చేవారి సమస్య విన్నాక ముందుగా వారేమిచేద్దామనుకుంటున్నారో అడిగి తెలుసుకుంటాను. కాస్త అటూ ఇటూగా వారు చేద్దామనుకుంటున్నదానినే నేను వారికి సలహాగా ఇస్తాను. వారు చేద్దామనుకుంటున్నదానిని సమర్ధించడం వల్ల మనం మంచి సలహ ఇచ్చామన్న భావన వారికి, మన సలహ మన్నించారనే త్రుప్తి మనకి కలుగుతుంది అన్నాడు.

సోదరుడి సలహా పాటించి శీనయ్య కూడా త్వరలోనే మంచి పేరు సంపాదించుకున్నాడు.

చిన్నప్పుడు చందమామ లో చదివిన ఈ కథ నాకు బాగా గుర్తుండే, నేను పక్కగా అనుసరించే నీతి కథ.

మేడిపండు వ్యాపారాలు

భారతదేశం లో ఏ వ్యాపారాన్ని తీసుకున్నా,న్యాయం గా,ధర్మంగా చేస్తే అవి గిట్టుబాటుగా ఉండవని నాకు అనిపిస్తూంటుంది. నాకు ఎదురైన కొన్ని ఉదాహరణలు.

1) మా పక్క కాలనీలో ఒక స్వీట్ షాపు ఉంది.చిన్న కాలనీకి ఆ స్వీట్ షాప్ అవసరమా అనిపించేది, రోజుకి నలుగురో, ఐదుగురోకస్టమర్లు వచేవారు. ఆ మాత్రం కస్టమర్లకి బిజినెస్ ఏవిధంగా గిట్టుబాటు అవుతుందో అని నా డౌటు. ఒక రోజు రాత్రి నాకు అర్ధం అయ్యింది ఆ షాపు ఎలా నడుస్తుందో, ఆ షాపులో స్వీట్లు,సాఫ్త్ డ్రింకులతోబాటుగా బీర్లు అమ్ముతారు. అసలు కస్టమర్లు వచ్చేది రాత్రి పది దాటిన తరువాత అదీ బీర్లు, విస్కీలు కొనడానికి. అదీ సంగతి
2)అదే కాలనీలో ఒక స్వగ్రుహా షాపు ఉంది.మేము రెగ్యులర్ గా కారా, మిక్చర్లు గట్రా కొంటామా షాపులో. ఒక సారి ఆ షాపు కి వెళ్తే మిక్చర్ లేదు, రేషన్ బియ్యం ఇంకా రాలేదు వచ్చాక మిక్చర్ చేస్తాము అని అన్నారు. రెండు రూపాయల బియ్యం, సబ్సిడీ గ్యాస్,కిరోసిన్ లేకుంటే ఆ వ్యాపారం కూడా గిట్టుబాటు గాని వ్యాపారం అన్నమాట.
3)ఎగస్ట్రా ఫ్లోర్లు,సెల్లార్లో ఫ్లాట్లు,పెంట్ హౌస్ లు కట్టి అమ్ముకోకపోతే బిల్డర్లకు గిట్టుబాటు కాదు. ఎకరం 2 కోట్లు పెట్టి కొంటే, పునాదులకని తవ్విన మట్టి అమ్ముకుంటే దాదాపుగా 20లక్షలు ఆదాయం వస్తుంది.
4) రెండు రోజుల క్రితం మనం చూసిన లిక్కర్ షాపు టెండర్లలోను అంతే. ఒక్కో షాపుని కోట్లల్లొ పాడారు.నల్ల డబ్బుని తెల్లగా మార్చుకోవడానికే అంతగా ఖర్చు చేసారని వినికిడి.
5) ఇక ఫార్మా కంపెనీల గురించి చెప్పక్కర్లేదు, chemial waste ఎక్కడయినా పారబోయక పొతే వాటికి గిట్టుబాటు కాదు.
6) TV చానెల్స్ కి ఐతే Paid news, yellow journalism అసలైన రాబడి మార్గాలు.
ఇవి మచ్చుకి కొన్ని మాత్రమే. తరచి తరచి చూస్తే అన్ని వ్యాపారాల పరిస్థితి ఇంచుమించుగా ఇంతే అనిపిస్తుంది.

Thursday, June 10, 2010


నా పుత్రరత్నాలు ఉదయ్, అరవింద్.

Wednesday, June 9, 2010

It happens only in Hyderabad

If you ever get lost in India and want to find out where you are, this is the best way of doing just that.
scenario 1
two guys are fighting and a third guy comes along,then a fourth and they start arguing about who's right - you are in Kolkata.
scenario 2
two guys are fighting and a third guy comes along,sees them and walks on – that's Mumbai.
scenario 3
two guys are fighting and a third guy comes along &tries to makepeace. the first two get together & beat him up - that's Delhi .
scenario 4
two guys are fighting.. a crowd gathers to watch. a guycomes along and quietly opens a chai Biscut stall - that's Ahmadabad.
scenario 5
two guys are fighting and a third guy comes. he writes a software program to solve the issue but the fight does not stop because of a bug in the program.
that's Bangalore .
scenario 6
two guys are fighting. a crowd gathers to watch. a guycomes along and quietly says "anna, doesnt like ths kind of fights". peace comes in - thats Chennai.
scenario 7
two guys are fighting. a crowd gathers to watch.someone calls police.the police come and lathi charge all the people crowded there. someone throws stones at the police. the police throw stones back at the crowd. some people are arrested. damages to the shops nearby. nextday, harthal and holiday declared by government ..You are in Thiruvananthapuram, the capital city of Kerala
scenario 8
two guys are fighting. both of them take time out and call their friends on mobile. now almost 50 guys are fighting. you are very much in Hyderabad.

Introduction to my blog

వౄత్తి రీత్యా నేను Pharma sales person ని, వౄత్తి కి సంభంధించి చాలా కాలం క్రితమే నేను కొన్ని Blogs ప్రారంభించినా, ప్రవ్రుత్తి ని, బాషాభిమానాన్ని చాటుకోవడానికి, నా అభిప్రాయాలు వ్యక్తం చేసుకొవదానికి, తెలుగు లో ఈ Blog ని ఆరంభిస్తున్నాను.
ఇది, అది అని ఏ ఒక్క దానికో పరిమితం కాకుండా ఫార్మా నుంచి మీడియా, పాలిటిక్స్,సినిమా, రియల్ ఎస్టేట్ దాకా నాకు అభిరుచి ఉన్న అన్ని విషయాలను స్ప్రుశించనున్నాను.
మీ

క్రిష్ణ

Tuesday, June 8, 2010

Hetero Drugs - CMD - పార్థసారథి గారి కుమారుడి వివాహం




Hetero Drugs - CMD - పార్థసారథి గారి కుమారుడి వివాహం
నా జీవితం లో నే అతి ఖరీదయిన పెళ్లిని చూదటం.Hyderabad లోని HITEX ప్రాంగణం లొ గత ఆదివారం నాడు అతి వైభవంగా జరిగింది. ఈ పెళ్లికి దాదాపుగా 50 కోట్లు ఖర్చు చేసారని విన్నాను. మొత్తం 15000 మంది ఈ పెళ్లికి హాజరు అయ్యారు. ఎక్కువమంది ఆ సంస్థ లో పని చేసే ఉద్యోగస్థులు వారి కుటుంబ సభ్యులు, customers, suppliers హాజరు అయ్యారు. ఇది 4 రోజుల కార్యక్రమం. ఆదివారం పెళ్లి, అదే రాత్రి చౌమొహల్లా పాలస్ లో విందు, తరువాతి రోజున Novotel Hotel లో విందు,ఆ తరువాతి రోజున Gachibowli stadium లో విందు,తరువాతి రోజున వారి స్వస్థలం Sattupalli లో విందు. మీ కోసం కొన్ని ఫోటొలు.